ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు మరోసారి విచారణ

by సూర్య | Tue, Oct 26, 2021, 11:24 AM

ముంబై క్రూయిజ్‌ షిప్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు ఆర్యన్‌ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ.ఈ కేసులో అరెస్టైన మిగతా వారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్‌సీబీ . ఇప్పటి వరకు క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో 20మందిని అరెస్ట్‌ చేశారు ఎన్‌సీబీ అధికారులు. గతవారం ఆర్యన్‌ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. అక్టోబర్‌ 8న దాఖలు చేసిన ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి బెయిల్‌పై విచారణ జరుపుతున్న న్యాయస్థానం. ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM