బిగ్ బాస్5 లోకి హాట్ యాంకర్ రష్మీ?

by సూర్య | Sat, Jun 12, 2021, 01:13 PM

బిగ్ బాస్ 5.. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఇదే హాట్ టాపిక్. ఎప్పుడెప్పుడు ఈ షో ప్రారంభం అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ షోకు రానంత టీఆర్పీ రేటింగ్ బిగ్ బాస్ సొంతం అయింది. అందుకే.. బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సీజన్ 4 మాత్రం సూపర్ సక్సెస్ అయింది.క్రేజ్ సంపాదించుకున్న, సీజన్ 5 లో మంచి ఫేమ్ ఉన్న లేడీ యాంకర్ ను తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం యోచిస్తోందట. అందుకే.. జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీని బిగ్ బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేసిందట. ఇప్పటికే తనను సంప్రదించడం కూడా పూర్తయిందట. కానీ.. తను ప్రస్తుతం మల్లెమాలతో వర్క్ చేస్తున్నందున.. తనను బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు.. మల్లెమాల యాజమాన్యం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ లోకి వస్తే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం వెనకాడటం లేదట. కానీ.. రష్మీకి మల్లెమాలతో అగ్రిమెంట్ ఉండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట. మరి.. మల్లెమాలతో బంధం తెంచుకొని.. బిగ్ బాస్ లోకి రష్మీ ఎంట్రీ ఇస్తుందా? లేక తనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల కోసం బిగ్ బాస్ ఆఫర్ నే వదిలేసుకుంటుందా? వేచి చూడాల్సిందే.

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM