రవి తేజ 'కిక్ 'తరహాలో కొత్త మూవీ

by సూర్య | Mon, Jun 07, 2021, 03:25 PM

రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇటలీ కొంత భాగం షూటింగ్ చేసుకుంది.


ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత  రవితేజ ఎంత మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వచ్చేనెలలో త్రినాథరావు నక్కిన సినిమాను మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. 'కిక్' తరహాలో ఈ సినిమా యాక్షన్ తో కూడిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలోను ఆయన సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేయనున్నారట. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. దాని ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చిందనేది తెలియాల్సి ఉంది.

Latest News
 
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM