భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన రియల్ హీరో సోనుసూద్ ?

by సూర్య | Wed, Jun 02, 2021, 03:11 PM

కరోనా వైరస్ కష్టకాలంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడిన ఎందరినో ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. అతడు చేస్తోన్న సేవలతో దేశం మొత్తం అతడిని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఎవరు సహాయం అడిగినా.. కాదనకుండా చేసి పెడుతున్నాడు సోను. సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు కూడా లేని క్రేజ్ సోను దక్కించుకున్నాడు. జనాల్లో అతడికి పెరిగిన ఫాలోయింగ్ చూసిన మేకర్స్ తమ సినిమాల్లో సోనుకి ఛాన్స్ ఇస్తున్నారు. తెలుగు దర్శకులు కూడా సోనుని సంప్రదిస్తున్నారు. గతంలో విలన్ వేషాలు వేసి టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు.సోనూసూద్ చివ‌ర‌గా న‌టించిన సినిమా అల్లుడు అదుర్స్ కోసం రూ.2.5 కోట్లు తీసుకున్నార‌ట‌. అయితే బాల‌య్య అఖండ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించేందుకు సోనూసూద్ ను సంప్ర‌దించ‌గా ఆయ‌న టీం కు షాక్ ఇచ్చార‌ట‌. ఏకంగా రూ. 7కోట్ల రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేశార‌ట‌. దాంతో అఖండ చిత్ర యూనిట్ అంత ఇచ్చేందుకు వెన‌క‌డుగు వేసింద‌ట‌. ఇక సోనూ సూద్ భారీగా డిమాండ్ చేయ‌డంతో అఖండ టీం ప్ర‌స్తుతం వేరే వాళ్ల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌. 


ఇదిలా ఉండ‌గా గ‌త కొద్ది రోజుల నుండి సోనూ త‌న రెమ్యున‌రేష‌న్ ను పెంచార‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆయ‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను బ‌ట్టి చూస్తే ఆయ‌న‌కు ఏడు కోట్ల రెమ్యున‌రేషన్ ఇవ్వొచ్చ‌నే విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానికి కార‌ణం ఆయ‌న్ను చూసి కూడా సినిమాకు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఉన్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM