వకీల్ సాబ్ పై 'మహేష్ బాబు' స్టన్నింగ్ కామెంట్స్

by సూర్య | Sun, Apr 11, 2021, 11:24 AM

ఒక స్టార్ హీరోని ఇంకో స్టార్ హీరో ప్రశంసల్లో ముంచెత్తడం అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడని ప్రశంసించడం ఈగోలకు తావు లేని గొప్ప అనుబంధానికి సింబాలిక్ అనడంలో ఎలాంటి సందేహమేం లేదు. ఈ తరహా స్నేహానుబంధాన్ని కొనసాగించడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ పవన్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వకీల్ సాబ్ పైనా పవన్ పైనా మహేష్ ఏమని ట్వీట్ చేశారు? అంటే...``పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్ లో ఉన్నారు... వకీల్ సాబ్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ని అందించారు. వ్వాటే కంబ్యాక్!`` అని మహేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పవన్ అభిమానులు ఖుషీ అయిపోవడమే గాక సోషల్ మీడియాల్లో దానిని వైరల్ చేస్తున్నారు. మహేష్ తన ట్వీట్ లో పవన్ కల్యాణ్ నటనతో పాటు ప్రకాష్ రాజ్ పనితీరును ప్రస్థావించారు.``ప్రకాష్ రాజ్ కచ్చితంగా తెలివైనవాడు` అని ప్రశంసించిన మహేష్ వకీల్ సాబ్ లో నటించిన  నివేద థామస్- అంజలి - అనన్య నాగళ్ల  స్పందనలు అద్భుతం అని పొగిడారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM