నా కెరీర్‌లో బెస్ట్‌ చిత్రం వకీల్ సాబ్ : నివేదా థామస్‌

by సూర్య | Fri, Apr 09, 2021, 02:06 PM

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాతో తెరపై కనిపిస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్‌' గురించి నివేదా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు..మహిళా సాధికారత ప్రధానాంశంగా తెరకెక్కిన ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకుని ఇందులో భాగమైనందుకు పవన్‌ సర్‌కి ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయనకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ కథ ఎంతోమందికి చేరువవుతుంది. ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఓ అద్భుత అనుభవాన్ని అందించింది. ఇందులో నేను పల్లవి అనే సాధారణమైన అమ్మాయి పాత్ర పోషించాను. 'పింక్‌' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన 'వకీల్‌సాబ్‌'లో భాగమైనందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ఆ కథను తెలుగువారికి చేరువయ్యేలా తెరకెక్కించడాన్ని గొప్ప బాధ్యతగా భావించాం. ఈ చిత్రం లో నాకు కోర్టు రూమ్‌ సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నా కెరీర్‌లో బెస్ట్‌ చిత్రమవుతుందని వకీల్ సాబ్ నమ్ముతున్నాను. వేణుశ్రీరామ్ గారు మాకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని అందించారు ఆయనకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM