వరుణ్ తేజ్ కు సాయి పల్లవికి పెళ్లి.. నాగబాబు రిప్లే!

by సూర్య | Tue, Apr 06, 2021, 03:42 PM

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ఫిదాలో చేసిన సందడి ప్రేక్షకులు అంత ఈజీగా మరువలేరు. అయితే తాజాగా సాయి పల్లవి, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ టాపిక్ వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో నాగబాబు చాట్ చేశారు. ఈ సందర్భంగా ‘వరుణ్ అన్న, సాయి పల్లవికి పెళ్లి చేస్తారా సార్.. జోడీ బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెట్ పై నాగబాబు చాలా సింపుల్ గా రిప్లై ఇచ్చాడు. ఈ ప్రశ్నకు ఎలాంటి కామెంట్ చేయకుండా జాతి రత్నాలు సినిమాల్లో బ్రహ్మానందం వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో బ్రహ్మానందం చెప్పే ‘తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే’ అనే డైలాగ్‌తో నాగబాబు ఇచ్చిన పంచ్ నెట్ లో వైరల్ గా మారింది. అంతకు ముందు వరుణ్ అన్న మ్యారెజ్ ఎప్పుడు చేస్తారు బాస్? అని ఓ నెటిజన్ అడుగగా మంచి సంబంధాలు ఉంటే చూడండి అంటూ సమాధానం ఇచ్చారు నాగబాబు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM