by సూర్య | Sat, Apr 03, 2021, 10:42 AM
ఆర్.ఆర్.ఆర్ లేదా రౌద్రం రణం రుధిరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయ తెలుగు-భాష చిత్రం. దీన్ని ఎస్.ఎస్ రాజమౌళి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.టి.రామారావు, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. థియేట్రికల్ రైట్స్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్.. అన్నీ కలిపి సుమారు 900 కోట్ల బిజినెస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News