నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న రాశీ ఖన్నా..

by సూర్య | Sat, Apr 03, 2021, 09:42 AM

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చైతన్య ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు చైతన్య. అందులో భాగంగా ఆయన థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఆ మధ్య నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని టాక్. ఈ సినిమాలో హీరో నాగచైతన్య కు జోడీగా అందాల రాశీఖన్నా ఎంపిక అయ్యింది. వెంకీ మామ సినిమా తర్వాత మరోసారి నాగచైతన్యకు జంటగా ప్రేక్షకులను అలరించ నుంది రాశీఖన్నా. ఈ సినిమాతో పాటు రాశీ ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న "పక్కా కమర్షియల్ "మూవీ లో కూడా నటించనుంది.


 


ఇక నాగ చైతన్య లవ్ స్టోరి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగనుంది. శేఖర్ కమ్ముల దర్శకుడు. శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. అందులో భాగంగా మరోసారి నాగ చైతన్య సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్‌గా ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇటీవల విడుదలైన సారంగ దరియా సాంగ్ సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది. మంచి లిరిక్స్‌తో పాటు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా ఉండడంతో పాట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.


ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్మడు పోయినట్లు సమాచారం. 'లవ్ స్టోరీ' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోయిన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ఆహా దక్కించుకుందని తెలుస్తోంది.




 

Latest News
 
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 03:17 PM
జెమినీ టీవీలో రేపు ప్రీమియర్ కానున్న సినిమాల లిస్ట్ Sat, Apr 20, 2024, 03:12 PM
'రత్నం' నుండి ప్రాణం నా ప్రాణం సాంగ్ అవుట్ Sat, Apr 20, 2024, 03:11 PM
'ప్రతినిధి 2' ట్రైలర్ రిలీజ్ Sat, Apr 20, 2024, 03:08 PM
నేడు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'పోకిరి' Sat, Apr 20, 2024, 02:58 PM