by సూర్య | Wed, Mar 31, 2021, 05:39 PM
హీరోయిన్ ప్రియమణి టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోను పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ప్రియమణి తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ లో బ్లాక్ డ్రెస్‌లో ఉండే ఫోటోలని షేర్ చేసింది. ఈ సమయంలో మీ న్యూడ్ ఫోటో షేర్ చేయండంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు ప్రియమణి ఘాటుగా సమాధానం ఇచ్చింది. నా కంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లిని గాని అలాంటి ఫోటో అడిగి షేర్ చేయండి. అప్పుడు నేను కూడా పెడతా అంటూ జవాబిచ్చింది. దీంతో ఆ నెటిజెన్ ప్రియమణిని క్షమాపణలు కోరాడు.
Latest News