వైరల్ అవుతున్నబాలయ్య డిఫరెంట్ లుక్

by సూర్య | Tue, Mar 30, 2021, 04:34 PM

సినిమా సినిమాకు కొత్త లుక్ చేయమన్నా కూడా ఏ మాత్రం అలిసిపోకుండా ప్రయత్నించే హీరో బాలయ్య బాబు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు నటసింహం. ఇప్పుడు కూడా బోయపాటి సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఈయనతో గతంలో చేసిన సింహా, లెజెండ్ సినిమాల కోసం కొత్త బాలయ్యను చూసారు అభిమానులు. ఇప్పుడు మూడోసారి కాంబినేషన్‌లో కూడా అదే చేస్తున్నాడు బోయపాటి. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనంత కొత్తగా, అందంగా చూపించబోతున్నాడు. తాజాగా హొలీ పండుగను 'BB3' చిత్ర బృందంతో కలిసి జరుపుకున్నాడు బాలయ్య. అక్కడే ఓ చిన్న పాపతో రంగులు పూయించుకుంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో బాలయ్య లుక్ కూడా అభిమానులను అలరిస్తుంది.నెరిసిన గడ్డం.. చిన్నపాటి జుట్టుతో కొత్తగా డిఫరెంట్‌గా ఉన్నాడు. ఈ లుక్ గతంలో ఏ సినిమాలో కూడా బాలకృష్ణ ట్రై చేయలేదు. ఈ గెటప్ బోయపాటి కోసమే అనేది అర్థమవుతుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో చిత్రంలో 'అఖిల్' బ్యూటీ సయేషా సైగల్ - 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM