by సూర్య | Sat, Mar 27, 2021, 02:15 PM
ప్రస్తుతం రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కలిసి రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా మెగా అభిమానులతో పాటు చిత్ర సీమా ప్రముఖులు చరణ్ కు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన విషెష్ వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ లో సీతారామరాజు గా చరణ్ , భీం పాత్రలో ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజు సందర్భాంగా ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా బానం విసురుతున్న చెర్రి లుక్ను తన ట్విటర్లో షేర్ చేశాడు. ‘ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్చరణ్’ అంటూ విష్ చేశాడు ఎన్టీఆర్.
Latest News