'దగ్గుబాటి' స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ

by సూర్య | Sat, Mar 27, 2021, 02:31 PM

దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన సినిమాల కంటూ ప్రత్యేక అభిమానులున్నారు. అంతేకాదు దర్శకత్వ ప్రతిభ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేసారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో పాటు సారంగదరయా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూట్‌లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ మూవీ కూడా కన్ఫామ్ చేసాడు. ఈయనతో ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న ప్రొడ్యూసర్ నారాయణ దాస్ నారంగ్ తమ నెక్ట్స్ మూవీని కూడా శేఖర్ కమ్ములతో చేయడానికి రెడీ అయ్యారు. లవ్ స్టోరీ తర్వాత తెరకెక్కబోయే సినిమాలో విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వెంకటేష్‌తో ఓ కథను నేరేట్ చేసినట్టు సమాచారం. వెంకటేష్‌తో లీడర్ తరహా కొంచెం యాక్షన్ టచ్ ఉన్న సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ రైల్వే కూలీ పాత్రలో కనిపంచబోతున్నట్టు సమాచారం. రైల్వే కూలీ ఎలా లీడర్‌గా ఎదగడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. మొత్తంగా శేఖర్ కమ్ముల శైలిలో సాగే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ‘లీడర్’ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ తెరకెక్కిస్తున్నాడు. 

Latest News
 
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM