రామ్ 'రెడ్' మూవీ 5 డేస్ కలెక్షన్స్..!

by సూర్య | Tue, Jan 19, 2021, 05:20 PM

రామ్ నటించిన తాజా చిత్రం 'రెడ్'. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన ఈ చిత్రంలో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ లు హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 'శ్రీ స్రవంతి మూవీస్' పతాకంఫై 'స్రవంతి' రవి కిషోర్ నిర్మించారు.'రెడ్' సినిమాకి మొదటిరోజు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. విడుదలైన 5 రోజుల్లోనే 'రెడ్' చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఆ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం -5.66 cr
సీడెడ్ -2.82 cr
ఉత్తరాంధ్ర -1.61 cr
ఈస్ట్ -1.29 cr
వెస్ట్ -1.41 cr
కృష్ణా -1.00 cr
గుంటూరు -1.05 cr
నెల్లూరు -0.83 cr
ఏపీ+తెలంగాణ టోటల్ -15.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా -0.70 cr
ఓవర్సీస్ -0.32 cr
టోటల్ వరల్డ్ వైడ్ -16.67 cr
'రెడ్' చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 16.67 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లు అంతా సేఫ్ అయిపోయారనే చెప్పాలి. సోమవారం రోజున కూడా ఈ చిత్రం కోటి రూపాయల పైనే షేర్ ను రాబట్టడం మరో విశేషం. ఇక 'రెడ్' హిట్ తో రామ్ హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసేసాడు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM