టబు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ హ్యాక్‌..

by సూర్య | Mon, Jan 18, 2021, 11:46 AM

సోషల్‌ మీడియా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోతోంది. తారలు తమ వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంది. కొందరు హ్యాకర్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ కొన్ని లింక్లను షేర్‌ చేస్తున్నారు.
ఈ హ్యాక్ బారినపడిన వారిలో అనేక మంది సినీనటులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీనటి టబు హ్యాకింగ్‌ బాధితుల జాబితాలో చేరిపోయారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ కి గురైనట్లు ఆమె వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేశారు. హ్యాక్‌ అలర్ట్‌… నా అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. నా అకౌంట్‌ను నుంచి వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్‌ చేయకండి అంటూ టబు అభిమానులను కోరారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM