'లైగర్' గా వస్తున్న విజయ్ దేవరకొండ..?

by సూర్య | Mon, Jan 18, 2021, 12:07 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నూతన చిత్రాన్ని స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకు మొన్నటి వరకు ఫైటర్ అనే పేరును ప్రచారం చేశారు. కానీ ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తన కొత్త సినిమాకు ఫైటర్ పేరును ఖరారు చేయడంతో పూరి తన సినిమాకు మరో పేరును వెతుకున్నాడు. అయితే తన సినిమా పేరు, ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేయనున్నట్లు నిన్న అప్‌డేట్ ఇచ్చారు. ఎట్టకేలకు నేడు విజయ్ కొత్త సినిమా పోస్టర్, పేరు వచ్చేశాయి. ఈ ఫస్ట్ లుక్‌లో బాక్సర్ గ్లౌవ్స్ వేసుకొని పవర్ పంచ్ కొట్టేందుకు విజయ్ సిద్దంగా ఉన్నట్లు ఉంది. అయితే మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. అదే పేరును ఈ సినిమాకి ఓకే చేశారు. అంతేకాకుండా 'సాలా క్రాస్ బ్రీడ్'అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా టైటిల్ ఖరారు అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండె హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు.
ఈ పోస్టర్‌ని విజయ్ దేవరకొండ తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. అంతేకాకుండా 'మా నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాను ప్రకటిస్తున్నాం. కచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా పిచ్చెక్కిస్తుంద'ని విజయ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను హందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. దీనిని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌, పూరీ, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు విడుదలైన ఈ పోస్టర్ వాటిని తారా స్థాయికి తీసుకెళ్లింది. మరి విజయ్ తన పవర్ పంచ్‌తో ఎందరిని పడగొడతాడో వేచి చూడాలి.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM