అదరగొడుతున్న ‘అల్లుడు అదుర్స్’..

by సూర్య | Sun, Jan 17, 2021, 05:04 PM

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ‘కందిరీగ’ ఫెమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తొలి వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..పండగ సీజన్స్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు మంచి కలెక్షలు వస్తాయి. ‘అల్లుడు అదుర్స్’ కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుందని అన్నారు. `శాటిలైట్ హక్కులు సహా మొత్తం డిజిటల్ హక్కులు 21 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా బడ్జెట్ సుమారు 32 కోట్లు అయ్యింది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 10 కోట్ల వసూల్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల జోన్లోకి ఎంటర్ అయ్యాయంది`అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెరుగైన నటనతో ఆకట్టుకున్నాడు.
సోనూసూద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. దేవీశ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM