అమితాబ్ ట్వీట్ పై నెటిజన్ల మండిపాటు!

by సూర్య | Fri, Jan 15, 2021, 01:22 PM

టీమిండియా క్రికెట‌ర్లంద‌రికీ కూతుళ్లే పుడుతున్నారంటూ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇటీవ‌లే కూతురు పుట్టిన నేపథ్యంలో బిగ్ బీ ఇలా దీనిపై స్పందించారు. భార‌త మాజీ, ప్ర‌స్తుత‌ క్రికెట‌ర్లు రైనా, గంభీర్‌, రోహిత్ శ‌ర్మ‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేశ్ యాద‌వ్‌ లంద‌రికీ కూతుళ్లే పుట్టార‌ని అమితాబ్ పేర్కొన్నారు. వీళ్లంతా భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ ను త‌యారు చేస్తారా? అని ట్వీట్ చేశారు. అందులో ధోనీ కూతురు కెప్టెన్‌ గా ఉంటుందేమో అంటూ చమత్కరించారు. దీంతో అమితాబ్ పై కొంద‌రు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. మరికొంత‌మంది అభిమానులు సూప‌ర్ అని కామెంట్ చేస్తుండ‌గా.. ఇంకొందరు మాత్రం క్రికెట్ ‌లోకి కూడా వారస‌త్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటూ అమితాబ్ పై మండిప‌డ‌టం విశేషం.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM