యాంకర్ ప్రదీప్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

by సూర్య | Mon, Jan 11, 2021, 04:17 PM

బుల్లితెరపై తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించాయి. కాని కరోనా వలన చిత్ర రిలీజ్ వాయిదా పడింది.
ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా' అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైన ఈ పాట సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంగా మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుందని తెలియజేశారు. దీంతో యాంకర్ ప్రదీప్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM