షార్ట్ ఫిల్మ్ లో రెచ్చిపోయిన ‘అనుపమ’

by సూర్య | Fri, Jan 08, 2021, 09:45 AM

షార్ట్ ఫిల్మ్ లో రెచ్చిపోయింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న ఈ మలయాళ లఘు చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.   ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ షార్ట్ ఫిల్మ్ టీజర్ చూస్తుంటే ఇది భార్యాభర్తల మధ్య జరిగే స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ – హక్కిం షాజహాన్ జంటగా నటించారు. నీకోసం ఏమైనా చేస్తానని హక్కిం అంటుండగా.. నాకోసం ఎవరినైనా చంపుతావా? అని అనుపమ అడుగుతుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఉన్న అనుపమ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అను రెచ్చిపోయి నటించిందని అర్థం అవుతోంది. ఆర్ జే షాన్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించగా.. అఖిల్ మిధున్ నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ మలయాళ షార్ట్ ఫిల్మ్ ని తెలుగు కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM