మరోసారి మాటల మాంత్రికుడితో... సమంత..?

by సూర్య | Mon, Oct 19, 2020, 11:41 AM

ప్రస్తుతం తెలుగులో 'జాను'తో పాటు, తమిళంలో నయనతారతో కలసి ఓ చిత్రంలో నటిస్తున్న అందాలతార సమంత తాజాగా 'ద ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM