బిగ్ బాస్ 4: నామినేషన్స్ రచ్చ.. ఈ వారం అందరి అతనే టార్గెట్..

by సూర్య | Mon, Oct 12, 2020, 04:12 PM

బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం వచ్చింది అంటే నామినేషన్స్ హంగామా మొదలైనట్టే. ఇంటి సభ్యులందరు తమకు ఎవరు నచ్చరో వారిని హౌజ్ లో నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రతి వారం లానే ఈ వారం కూడా హౌజ్ మేట్స్ అందరిని గార్డెన్ ఏరియాలో నిలబెట్టి మిరపకాయల దండ తాము నామినేట్ చేయాలనుకునే వారి మీద వేయాల్సి ఉంటుంది.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో మిరకాయంత ఘాటుగా నామినేషన్స్ హంగామా జరిగినట్టు తెలుస్తుంది. ఈ వారం అందరు ఇంటి సభ్యులు మెహబూబ్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ ప్రోమో అతనికే ఎక్కువ మిరపాకయల దండలు పడినట్టు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ బిబి హోటల్ టాస్క్ లో మెహబూబ్ టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటలు హౌజ్ మేట్స్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై వీకెండ్ లో నాగార్జున కూడా మెహబూబ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఆ కారణంగానే మెహబూబ్ ను హౌజ్ మేట్స్ అంతా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో కుమార్ సాయికి సోహెల్ కు గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అరియానా కూడా మెహబూబ్ తో వాదిస్తుంది. మళ్ళీ అభిజిత్ వర్సెస్ అఖిల్ ఢీ కొట్టారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ కూడా హాట్ హాట్ గా సాగనుందని తెలుస్తుంది. కింగ్ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో సోహెల్ తన కోపాన్ని తగ్గించుకున్నాడని అర్ధమవుతుంది. కుమార్ సాయి హారికని ఉద్దేశిస్తూ మరో రెండు దండలు ఉన్నా సరే ఆమెకే వేస్తానని అన్నాడు. మరి హారికను అలా అనడం వెనుక కుమార్ సాయి కారణాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM