తెలుగు భామ 'ఈషా రెబ్బా' బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిందంట..?

by సూర్య | Mon, Oct 12, 2020, 01:32 PM

'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఈషాకు సరైన సినిమా రాలేదు. ప్రస్తుతం పాపులర్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ లో నటిస్తోంది ఈషా. ఇప్పటి వరకు నటించిన పాత్రల కంటే ఈ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన క్యారక్టర్ భిన్నమైందని చెప్పవచ్చు.ఈ సినిమా అమ్మడు రెచ్చిపోయి నటించిందని టాక్. హిందీ వర్షన్ లో కియారా అద్వాని నటించిన పాత్రలో ఈషా కనిపించనుందట. ఇక బోల్డ్ సీన్స్ లో కియారను మించి నటించిందని అంటున్నారు. సంకల్ప్ రెడ్డి ఈ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా ఏ రేంజ్ గ్లామర్ ఎలివేట్ చేయనుంది అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈమధ్య ఈ అమ్మడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు యూత్ కు నిద్రపట్టనివ్వడం లేదు

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM