బిగ్ బాస్ 4: గంగవ్వ స్టోరీ విని అభిమానుల భావోద్వేగం

by సూర్య | Sat, Oct 10, 2020, 02:34 PM

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కథ విని అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొన్న అవ్వ ఎలాగైనా గెలవాలని ప్రార్థిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో గంగవ్వ మాట్లాడుతూ తాను బిడ్డను కోల్పోయిన సంఘటనను వివరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. "ఐదేళ్ల‌ప్పుడే పెళ్లి. 17 ఏళ్ల‌కే కొడుకు. ఇంకో రెండేళ్ల‌కే కూతురు పుట్టింది. తాగి కొట్టే భ‌ర్త విదేశాల‌కు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావ‌డంతో ఆమెను ఎత్తుకుని న‌డ‌క ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బ‌స్సు వ‌చ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి న‌న్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్ప‌త్రికి వెళ్లాను. అక్క‌డ ఆమె చ‌నిపోయింద‌ని చెప్ప‌గానే బిడ్డ‌ను ఎత్తుకుని వెనుదిరిగాను. బ‌స్ ఎక్క‌బోతే శ‌వంతోని లోప‌లకు రానీయ‌లేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని గంగవ్వ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు అవ్వకు వచ్చిన బాధ ఎవ్వరికీ రావొద్దని కామెంట్లు చేస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM