విజయ్ దేవరకొండ కామెంట్లపై వివాదం

by సూర్య | Sat, Oct 10, 2020, 01:55 PM

పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి చిత్రం తో యువత హృదయాలను కొల్లగొట్టాడు విజయదేవరకొండ. రాత్రికి రాత్రే విజయ్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా ఈ రౌడీ హీరోకి క్రేజ్ తగ్గలేదు. విజయ్ యాటిట్యూడ్ కి యువత ఫిదా అయిపోయారు. తాజాగా ఈ క్రేజీ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని సంచలన కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్ అనుపమ చోప్రాలతో చిట్ చాట్ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ .. డబ్బుల కోసం మందు కోసం ఓటును అమ్ముకునే తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు . అలాగే బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దని... చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని విజయ్ అన్నాడు ఇప్పుడు విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి . కొంతమంది విజయ్ వ్యాఖ్యలను సమర్దిస్తుంటే .. మరికొందరు తప్పుబడుతున్నారు.

Latest News
 
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM
ట్రెండీ లుక్ లో క్యూట్ గా అంజలి Sat, Apr 20, 2024, 02:07 PM