దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కొత్త సినిమా ప్రకటనకు ముహూర్తం..

by సూర్య | Thu, Oct 08, 2020, 04:05 PM

అక్టోబర్ 9వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రానుంది. నిర్మాణ సంస్థ వివరాలు వెల్లడిస్తుందని ఆయన ఒక వీడియో ట్వీట్ చేశారు. అందులో రాఘవేంద్రుడి మార్క్ సంగీతం వినిపించింది. అభిమానులకు ఆహ్లాదాన్ని అందించింది. ఏడుకొండల వెంకటేశ్వరుని భక్తుడి పాత్రలో అక్కినేని నాగార్జున నటించిన 'ఓం నమో వెంకటేశాయ' తర్వాత రాఘవేంద్రరావు మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మధ్యలో ఆయన సినిమా తీస్తారని వార్తలు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త సినిమా కబుర్లు చెప్పడానికి సిద్ధమయ్యారు. దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే దీనిని నిర్మించనున్నారని సమాచారం. నిజమో కాదో రేపు ఉదయం తెలుస్తుంది. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM