కాజల్ బ్యాచిలరేట్ పార్టీ ఫొటోస్...

by సూర్య | Wed, Oct 07, 2020, 01:22 PM

ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న వివాహం చేసుకోబోతోంది. ఈ విషయాన్ని కాజల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. త్వరలో గృహిణిగా మారుతున్న నేపథ్యంలో గత నెల చివర్లో కాజల్ ఇంట్లో బ్యాచిలరేట్ పార్టీ జరిగింది. ఈ ఫొటోలను కాజల్ గత నెల 28నే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. అయితే అవి బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన ఫొటోలని అప్పుడు ఎవరూ అనుకోలేదు.


తాజాగా కాజల్ తన పెళ్లి గురించి ప్రకటించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి `బ్రైడ్ టు బి` క్యాప్షన్‌తో కాజల్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ కార్యక్రమంలో కాజల్ చెల్లెలు నిషా కూడా పాల్గొంది. వివాహం తర్వాత కూడా నటన కొనసాగిస్తానని కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM