మానసికంగా, భౌతికంగా దివ్యాంగులైన వారి కోసం టాలెంట్‌ షో : ఉపాసన...

by సూర్య | Mon, Oct 05, 2020, 06:57 PM

మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆమె అక్కినేని కోడలు సమంతతో కలిసి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతోంది. ఇప్పుడు 'మన ఊరు మన బాధ్యత' పేరుతో గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేందుకు భర్త రామ్‌ చరణ్‌తో కలిసి ఆమె సన్నద్ధమవుతోంది.


యువర్‌ లైప్‌ అనే ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాట్‌ఫాంను స్థాపించిన ఉపాసన.. దాని ద్వారా తనకు సాధ్యమైనంతగా సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఓ టాలెంట్‌ షోను ఆమె నిర్వహించనున్నారు. ఈ టాలెంట్‌ షో ఎవరికోసమంటే.. మానసికంగా, భౌతికంగా దివ్యాంగులైన వారి కోసం. వారిలో దాగి ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ను ఈ షో ద్వారా ప్రోత్సహించాలని, ప్రపంచానికి వారిని తెలియజేయాలని ఉపాసన చేస్తున్న ఈ ప్రయత్నంలో రామ్‌ చరణ్‌తో పాటు స్టార్‌ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్‌ కూడా భాగం అవుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా జరగనున్న ఈ షో కి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఉపాసన ఓ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM