పెళ్లి పీటలు ఎక్కనున్న సాయి ధరమ్ తేజ్..?

by సూర్య | Mon, Oct 05, 2020, 04:00 PM

టాలీవుడ్ లో యువ హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లోనే రానా, నితిన్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. మరికొందరికి పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. కొణిదెల నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ ఖరారు కావాల్సి ఉంది. మరోవైపు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంట్లోవాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏపీకి చెందిన బంధువుల అమ్మాయినే పెళ్లాడుతున్నాడని సమాచారం. సాయి తేజ్ పెళ్లికి ఆయన మేనమామ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM