శరీరాకృతి గురించి ఎన్నడూ ఇబ్బంది పడలేదు :స్నేహ ఉల్లాల్

by సూర్య | Mon, Oct 05, 2020, 03:50 PM

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలలో నటించిన నటి స్నేహ ఉల్లాల్‌ ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె తిరిగి 'ఎక్స్‌పైరీ డేట్'‌ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. తాను శరీరాకృతి గురించి ఎన్నడూ ఇబ్బంది పడలేదని, ఐశ్వర్యరాయ్‌లా తాను ఉన్నానని అందరూ అనుకోవడం కూడా తనను బాధపెట్టలేదని తెలిపింది. సినీ పరిశ్రమలో ప్రమోషన్‌ కోసమే తనను అలా పరిచయం చేశారని ఆమె తెలిపింది.


తన జీవితంపై తనకు ఎలాంటి బాధ లేదుకానీ, సినీ పరిశ్రమలోకి మాత్రం చాలా త్వరగా వచ్చానని భావిస్తున్నానని అభిప్రాయపడింది. ఇంకొన్నాళ్లు సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే కనుక నటిగా తనకు తాను చాలా శిక్షణ ఇచ్చుకునేదాన్నని చెప్పింది. తాను చాలా ఏళ్ల అనంతరం 'ఎక్స్‌పైరీ డేట్‌' సినిమాతో మళ్లీ వస్తున్నానని తెలిపింది.  

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM