మళ్ళీ బిజీ కానున్న బ్రాహ్మీ...?

by సూర్య | Mon, Oct 05, 2020, 05:01 PM

మన తెలుగులో ప్రజలకు కామెడీ అనేది చాలా వరకు తగ్గింది. సినిమాల విషయంలో దూకుడు గానే ఉన్నా సరే కామెడీ విషయంలో మాత్రం చాలావరకు స్టార్ హీరోలు ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియకపోయినా... కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాల విషయంలో కమర్షియల్ కోణం ఎక్కువగా ఆలోచించడం తో ఇప్పుడు సినిమాల్లో కామెడీ అనేది దాదాపుగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే సినిమాల్లో కామెడీ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.


దీనితో చిత్ర దర్శకులు, రచయితలు కూడా సినిమాల్లో కామెడీ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో కామెడీ కి కొన్ని ప్రత్యేక పాత్రలు కూడా సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు ఎక్కువగా కామెడీ హీరోలు ఎక్కువగా కామెడీ చేసేవారు. ఇక ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ లను తీసుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రహ్మానందం గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనను సినిమాల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనకు ఒక కామెడీ పాత్ర ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో కూడా ఆయనకు ఒక మంచి పాత్ర ఇవ్వనున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. సునీల్ కి కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అరవింద సమేత సినిమా తర్వాత సునీల్ మరో సినిమాలో పూర్తిస్థాయిలో నటించలేదు. ఇప్పుడు మాత్రం కామెడీ రోల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా లో అతను ఒక కామెడీ పాత్ర చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM