త్రివిక్రమ్, ఎన్టీఆర్ భారీ బడ్జెట్ మూవీ

by సూర్య | Wed, Apr 01, 2020, 09:22 AM

ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పై ఆయన గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా చెబుతున్నారు. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తరువాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వాళ్లు భావిస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత నాలుగైదు నెలల తేడాతో త్రివిక్రమ్ సినిమా విడుదలవుతుంది. అందువలన భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించి, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే కథానాయిక పాత్రల కోసం బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'అరవింద సమేత' సినిమా తరువాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM