జయలలిత బయోపిక్ కు బాలయ్య నో?

by సూర్య | Tue, Mar 31, 2020, 11:52 AM

పాత్ర ఏదైనా.. డైలాగ్ ఏదైనా హావభావాలను పండించడంలో సీనియర్ ఎన్టీఆర్ కి తిరుగులేదు. ఆయన చేసిన పాత్రలు మరొకరు చేయడం అసాధ్యమని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిచ్చాడు దర్శకుడు క్రిష్. అందులో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటించాడు. కానీ 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలు అనుకున్నతంగా విజయం సాధించలేదు. దీంతో ఇక మీదట ఎన్టీఆర్ వేషం కట్టకూడదని బాలయ్య ఫిక్స్ అయ్యాడని టాక్.దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్ర కూడా వుంటుందట. కాగా ఎన్టీఆర్ పాత్ర చేయడం కోసం చిత్ర యూనిట్ బాలకృష్ణని సంప్రదించారట. కానీ ఆ పాత్ర చేయడానికి బాలకృష్ణ నిరాకరించినట్లు సమాచారం. దాంతో చేసేది ఏమి లేక ఎన్టీఆర్ పాత్రను సినిమాలో నుండి తొలిగించినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ పాత్రను నిజంగానే తొలిగించారా.. లేక మరెవరిచేతనైన నటింపజేశారా అనేది చూడాలి.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM