హ్యాపీ బర్త్ డే 'హరీష్ శంకర్'

by సూర్య | Tue, Mar 31, 2020, 11:56 AM

దర్శకుడిగా అవకాశం రావడం ఆషామాషీ విషయం కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. ఒక్కోసారి ఒక్క సినిమా దర్శకత్వం వహించే ఛాన్స్ ఒక జీవితకాలం ఎదురుచూసినా అది రాకపోవచ్చు. అలాంటిది సినీ పరిశ్రమ. ఆలాంటి సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు దర్శకుడు హరీష్ శంకర్.'చిరుత', 'బుజ్జిగాడు' సినిమాలకు రచనా సహకారం అందించి.. 'వీడే', 'నా ఆటోగ్రాఫ్' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. రవితేజ హీరోగా 'మిరపకాయ' సినిమాకు మొదటిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా కూడా హరీష్ శంకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని.. 'గబ్బర్ సింగ్', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గద్దలకొండ గణేష్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరోసారి సినిమా తీసే ఛాన్స్ కొట్టేసాడు. ఇలానే మరెన్నో విజయవంతమైన సినిమాలను టాలీవుడ్ కి అందించాలని కోరుకుంటూ హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM