లాక్‌డౌన్ పై ప్రభుత్వానికి పూరీ జగన్నాథ్ సలహా

by సూర్య | Sun, Mar 29, 2020, 02:32 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంది. ప్రతీ దేశంలోనూ చావులు కంటిన్యూ అవుతున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక.. జనాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మిగిలిన దేశాల ప్రజలేమో కానీ మన దేశంలో మాత్రం ఫ్రీడమ్ ఎక్కువ కదా.. అందుకే బయటి తిరిగిన ప్రాణాలకు ఇంట్లో కూర్చోండిరా అంటూ ఊరికే ఉండటం లేదు. అందుకే ఏదో ఓ కారణం చెప్పి బయటికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మరోవైపు రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దాంతో ప్రభుత్వానికి కూడా ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి.కొట్టాలా.. తిట్టాలా.. ఎలా చెప్తే మారుతారు మీరు అంటూ తల పట్టుకుంటున్నారు ముఖ్యమంత్రులు కూడా. కరోనాని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ తప్ప మరో ఆప్షన్ లేదని కేసీఆర్ సహా ప్రధాని మోదీ.. వైద్యులు, సినిమా ప్రముఖులు అంతా చెప్తున్నారు. అయినా కూడా కరోనా మమ్మల్నేం చేయదన్నట్లు బయటికి వచ్చేస్తున్నారు జనాలు. రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు. అడిగితే విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. ఇందులో నిజమైన కారణాలతో బయటికి వచ్చేవాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ వినూత్న సలహా ఇచ్చాడు. ప్రజలని లాక్‌డౌన్ చేయాలంటే.. ఓ దారి ఉందని చెప్పాడు ఈయన. అదే డ్రోన్.‌. గౌరవంతో చేయలేని పనులు భయంతోనే చేయించాలంటున్నాడు ఈయన. లాక్‌డౌన్‌కు ఆర్మీ, పోలీస్ ఆఫీసర్స్ అక్కర్లేదు.. తక్కువ ఖర్చుతో డ్రోన్‌కు దెయ్యాన్ని కట్టి జనాలపైకి వదిలేయండి అంటున్నాడు ఈ దర్శకుడు. అలా చేస్తే కచ్చితంగా చచ్చినట్లు ఇంట్లోనే ఉంటారంటూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసాడు పూరీ.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM