టాప్ గేర్లో థమన్ కెరీర్ !

by సూర్య | Fri, Jan 24, 2020, 03:53 PM

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్ లో వెళ్ళుతుంది. థమన్ ను అల వైకుంఠపురములో చాలా మెట్లు ఎక్కించింది. ఈసినిమా లోని సామజవరాగమన, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. అలా అలకు బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ఇచ్చి థమన్ ప్రస్తుతం తెలుగులో అరడజనకు పైగా చిత్రాల తో బిజీ గా వున్నాడు. అందులో మహేష్ బాబు 27తోపాటు బోయపాటి శ్రీను -బాలయ్య కాంబినేషన్ లో రానున్న సినిమా కూడా వుంది. ఇదిలా ఉంటే అల.. వైకుంఠపురములో తరువాత థమన్ సంగీతం అందించిన డిస్కోరాజా ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం తో మరోసారి తన ఫామ్ ను కొనసాగించాడు థమన్. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. చాలా సన్నివేశాలు అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ అయ్యాయి. అలాగే సినిమాలో ని మూడు సాంగ్స్ కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా కు థమన్ సంగీతం చాలా హెల్ప్ అయ్యింది. అయితే ఓవరాల్ గా డిస్కారాజా కు మాత్రం మిక్సడ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ రొటీన్ గా ఉండి సాగదీసినట్లుగా అనిపించింది. థమన్ సంగీతం,రవితేజ, బాబీ సింహ ప్లస్ అవ్వగా డైరెక్షన్ ,సెకండ్ హాఫ్ సినిమాకు మైనస్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం కూడా రవితేజ కు కావాల్సిన విజయాన్ని అందించండం అసాధ్యమే ఆయ్యేలా వుంది. తెలుగు రాష్ట్రాల్లో డిస్కారాజా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20కోట్ల షేర్ ను రాబట్టాలి. విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ , నాభా నటేష్ , తాన్యా హోప్ కథానాయికలు నటించగా రామ్ తాళ్లూరి నిర్మించాడు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM