'గంగూబాయి ఖథియావాడి' నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్!

by సూర్య | Thu, Jan 16, 2020, 01:30 PM

 సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో హీరోయిన్ ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'గంగూబాయి ఖథియావాడి'. ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ పోస్టర్లలో పవర్‌ఫుల్‌ స్టన్నింగ్‌ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది. ఈ పోస్టర్లలో ఆలియా యంగర్‌లుక్‌తోపాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా కనిపిస్తున్న లుక్‌ను కూడా చూడొచ్చు. సల్మాన్‌ ఖాన్‌తో అనుకున్న 'ఇన్‌షా అల్లా' సినిమా కొన్ని విభేదాల కారణంగా ఆగిపోవడంతో భన్సాలీ వెంటనే ఆలియాతో 'గంగూబాయి ఖథియావాడి'. సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్‌ జెదీ రచించిన మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM