రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘అల వైకుంఠపురములో’!

by సూర్య | Thu, Jan 16, 2020, 01:14 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. బన్నీ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ చూపించడం తో సినీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా పెద్ద విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకుంటుంది. ఇక ఈ సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం..టబు , జయరాం , సుశాంత్, నవదీప్ , సునీల్ , సముద్రఖని , రాజేంద్ర ప్రసాద్ మొదలగు స్టార్ నటి నటులు ఈ సినిమా లో నటించారు. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM