యూఎస్ లో బన్నీ, మహేష్ ల కలెక్షన్ల జోరు!

by సూర్య | Thu, Jan 16, 2020, 01:03 PM

ఈ సంక్రాంతికి  జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ విడుదల కాగా..జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో విడుదల అయ్యింది. ఇక దేశ వ్యాప్తం గా కూడా ఈ రెండు చిత్రాలు తమ సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.  సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో యూఎస్ బాక్సాపీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతున్నాయి.  ఈ రెండు చిత్రాలు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టాయి. సరిలేరు నీకెవ్వరు మూవీ  మంగళవారం సాయంత్రం వరకు 200 లొకేషన్స్ నుండి $91,700 డాలర్స్ వసూలు చేసింది. దీనితో సరిలేరు నీకెవ్వరు యూఎస్ బాక్సాపీస్ కలెక్షన్స్ $1.77 మిలియన్ డాలర్స్ కి చేరుకున్నాయి. ఈ వారాంతానికి ఈ చిత్రం $2 మిలియన్ మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అల వైకుంఠపురంలో మరింత మెరుగైన కలెక్షన్స్ రాబడుతుంది. మంగళ వారం అదే సమయానికి ఈ చిత్రం $1,70,200 డాలర్స్ 122 లొకేషన్స్ నుండి రాబట్టింది. మహేష్ మూవీతో పోల్చుకుంటే ఇవి దాదాపు రెట్టింపు వసూళ్లు అని చెప్పాలి. ఇక అల వైకుంఠపురంలో బాక్సాపీస్ కలెక్షన్స్ $1.74 మిలియన్ డాలర్స్ కి చేరాయి. బన్నీ ఊపు చూస్తుంటే చాలా వేగంగా $2 మిలియన్ మార్కు చేరుకునేలా ఉన్నాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM