11 రోజులో 250కోట్ల మార్కు చేరిన 'వార్'....

by సూర్య | Sun, Oct 13, 2019, 06:06 PM

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. రెండు నెలల క్రితం సూపర్ 30మూవీతో 150కోట్ల వసూళ్లు సాధించిన ఆయన, వార్ చిత్రంతో రికార్డు వసూళ్లు కొల్లగొడుతున్నారు. మొదటి రోజే 50కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వార్ మూవీ విడుదలైన 11రోజులకు 250కోట్ల మార్కు చేరుకుంది. దీనితో 2019 సవత్సరానికి గాను సెకండ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా వార్ నిలిచింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఉరి మూవీ వసూళ్లను వార్ మూవీ దాటివేయడం గమనార్హం. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్ 300కోట్లకు పైగా వసూళ్లతో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. వార్ వసూళ్ల జోరు ఇంకా కొనసాగడంతో కబీర్ సింగ్ కలెక్షన్స్ కూడా వార్ దాటేసే అవకాశం కలదు. టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన ఈ మూవీని సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM