వరుణ్ తేజ్ ‘పంచ్’‌కు ముహూర్తం ఫిక్స్

by సూర్య | Thu, Oct 10, 2019, 01:10 PM

F2, గద్దల కొండ గణేష్ వంటి డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి ప్రయోగాత్మకమైన సినిమాలలో, డిఫరెంట్ పాత్రలను ఎంచుకుని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్న వరుణ్.. ఈ సారి కిక్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. నేడు (అక్టోబర్ 10)న వరుణ్ తేజ్ 10వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ (అల్లు బాబీ) ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. రినస్సాన్స్ పిక్చర్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో రూపొందించనున్నారు. కిరణ్ కొర్రపాటి  దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.తొలిప్రేమతో వరుణ్‌కి మంచి ఆల్బమ్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ కానుంది. అల్లు వెంకటేష్‌తో పాటు సిద్ధు నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM