20 ఏళ్ల త‌రువాత అదే బికినీతో.... అదే చోట‌...

by సూర్య | Mon, Oct 07, 2019, 11:06 PM

 2014లో తన స్వస్థలం అయిన చండీగఢ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్ భామ గుల్ పనాగ్  పెళ్ళై  ఓ పిల్లాడికి తల్లి అయినా త‌న ఒంపు సొంపులు త‌గ్గ‌లేద‌ని చెపుతూ తాజాగా త‌ను ఇటీవ‌ల దిగిన ఓ బికినీ ఫోటోని త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో ఉంచింది. నాలుగు పదుల వయసులోనూ అంతే సెక్సీగా క‌నిపిస్తున్న ఈ  అమ్మ‌డు 1999లో మాల్దీవ్స్‌లో బికినీ వేసుకుని దిగిన ఫొటోను. ఇటీవల అదే ప్రదేశంలో అదే బికినీ వేసుకుని దిగిన ఫొటోను జ‌త చేసింది. 20 ఏళ్ల త్వాత మళ్లీ మాల్దీవ్స్‌కి వచ్చాను. ఇప్పటికీ నా మార్క్స్ అండ్ స్పెన్సర్ బికినీ ఏమాత్రం పాడవలేదు” అని క్యాప్షన్‌లో పేర్కొంది.  “ఈ ఫొటో చూస్తే అప్పటికి ఇప్పటికి ఆమెలో ఏ మార్పూ లేదు. ఇప్పటికీ అంతే సెక్సీగా, అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2003లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన గుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాక పోవ‌టంతో కెరీర్ కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగ‌లేదు.  ఆమె రాజకీయాల్లోకి వెళ్లింది. అక్క‌డా ఫ‌ట్ మ‌న‌డంతో మ‌ళ్లీ వెండితెర మీద మెర‌వాల‌నుకుంటోంద‌ట‌. అయితే ఆమె ఎంత ఫిట్‌గా త‌యారైనా ఈ 40 ఏళ్ల వయసులో తల్లి పాత్రలు, అక్క పాత్రలు మాత్రమే వస్తాయంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ భామామ‌ణి ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. 


 


 

Latest News
 
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 06:51 PM
నాగ చైతన్య - కార్తీక్ వర్మ చిత్రంలో పూజ హెడ్గే Thu, May 02, 2024, 06:46 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'శబరి' Thu, May 02, 2024, 06:42 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'గేమ్ ఛేంజర్' Thu, May 02, 2024, 06:38 PM