byసూర్య | Fri, Nov 01, 2024, 10:28 AM
రుణం ఉన్నా ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి రైతులను నిలువున మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి విమర్శించారు. గురువారం కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అన్ని వనరులున్న తెలంగాణను 7 లక్షల 12 వేల కోట్ల అప్పుచేసి అప్పుల కుప్పగా మార్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు.