విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఇక ఆ కష్టాలు తీరినట్టే.. సజ్జనార్ కీలక హామీ

byసూర్య | Wed, Oct 23, 2024, 10:15 PM

తెలంగాణలో విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు వినిపించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. సజ్జనార్ కీలక ప్రకటన విడుదల చేశారు. అయితే.. టీజీఎస్ ఆర్టీసీకి చెందిన ఒక బస్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియా ద్వారా యాజ‌మాన్యం దృష్టికి వ‌చ్చాయని సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో విద్యార్థుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటోందని పేర్కొన్న సజ్జనార్... ర‌ద్దీకి అనుగుణంగా బ‌స్సుల‌ను ఎప్పటిక‌ప్పుడు ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు. అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల ర‌ద్దీ వీప‌రీతంగా ఉంటున్న విష‌యం సంస్థ దృష్టికి వ‌చ్చిందని సజ్జనార్ తెలిపారు.


ఈ నేపథ్యంలో.. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఆయా రూట్లలో బ‌స్సుల‌ సంఖ్యను పెంచాల‌ని యాజ‌మాన్యం ఇప్పటికే నిర్ణయించినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు. ఆ దిశ‌గా చ‌ర్యలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. విద్యార్థుల‌ను క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం క‌ట్టుబ‌డి ఉందన్నారు. ప్రతి రోజు ల‌క్షలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బ‌స్సుల్లోనే త‌మ గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటున్నారని వివరించారు. విద్యార్థుల‌కు ర‌వాణా ప‌రంగా ఇబ్బందుల్లేకుండా త‌గిన‌న్ని బ‌స్సుల ఏర్పాటుకు చ‌ర్యలు తీసుకుంటామని సజ్జనార్ మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. త‌మ‌ వ్యక్తిగ‌త భ‌ద్రత‌ను దృష్టిలో పెట్టుకుని ఫుట్ బోర్డు ప్రయాణం చేయ‌కుండా స‌హ‌క‌రించాల‌ని విద్యార్థుల‌కు కూడా సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.


టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఈ ప్రకటనతో.. విద్యార్థులకు ఫుట్ బోర్డు ప్రయాణం కష్టాలు తీరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సజ్జనార్ అన్నట్టుగా విద్యార్థుల రద్దీని బట్టి బస్సు సర్వీసులు నడిపిస్తే.. విద్యార్థులకే కాకుండా సాధారణ జనానికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. వీటిపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇలా ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని.. విద్యార్థులు రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను హరీష్ రావు కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM