వాటన్నింటినీ వెంటనే తొలగించండి.. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై హైకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Wed, Oct 23, 2024, 10:12 PM

హైదరాబాద్‌లో సంచలంగా మారిన సికింద్రాబాద్‌‌లోని మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ విగ్రహా ధ్వంసం వివాదంపై ఉన్నత న్యాయస్థానం స్పందించారు. విగ్రహం ధ్వంసం చేస్తున్నప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సైబర్‌ క్రైం విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నగరంలో.. ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం.. అటు మతపరంగానే కాకుండా ఇటు రాజకీయపరంగానూ రచ్చకు కారణమైంది. కాగా.. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోలు కేవలం నగరంలోనే కాదు.. రాష్ట్రమంతా వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఈ వివాదం.. నగరం నుంచి రాష్ట్రాస్థాయికి చేరుకుంటోంది.


దీంతో.. అత్యంత సున్నితమైన, భావోద్వేగాలకు కారణమవుతున్న.. విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోలను, వాటి లింకులను సోషల్ మీడియా నుంచి తొలగించలేదంటూ న్యాయవాది ఐ రామారావు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి మగళవారం (అక్టోబర్ 22న) విచారణ జరిపారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయని.. వాటి వల్ల ఆయా వర్గాల భావోద్వేగాలకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఫలితంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ధర్మాసానానికి పిటిషనర్ వివరించారు.


అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇంకా స్పందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. విగ్రహ ధ్వంసానికి స్పందించిన వీడియోలను తొలగించాలని కేంద్ర సైబర్‌ క్రైం విభాగాన్ని ఆదేశించింది. పిటిషనర్‌ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మారేడ్‌పల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు.. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొనవారిపై పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే కొట్టేయ్యాలని కోరుతూ హైకోర్టులో ముగ్గురు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం (అక్టోబర్ 23న) విచారణ జరుగనుంది.


ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై ఇప్పటికే హిందూ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నిందితులను శిక్షించాలంటూ ఆలయం వద్ద.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించగా.. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM