బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. వారం రోజులు డెడ్ లైన్

byసూర్య | Wed, Oct 23, 2024, 07:29 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ప్రత్యర్థులు చేస్తున్న అనుచిత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు పరువునష్ట దావా వేయగా.. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించారు.


తన పరువుకు భంగం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. వారం రోజుల్లోగా తనకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని బండి సంజయ్‌ను కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు లీగల్ నోటీసులు పంపించారు. కాగా.. ఈ నోటీసులపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


అయితే.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో అభ్యర్థులు చేసిన ధర్నాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బండి సంజయ్ చలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి.. గ్రూప్-1 పరీక్షపై చర్చించేందుకు సెక్రటేరియట్‌కు ఆహ్వానించారు. అనంతరం.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో.. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే.


కాగా.. ఈ గ్యాప్‌లోనే గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన, బండి సంజయ్‌ మద్దతుపై స్పందించారు. రేవంత్ రెడ్డి సర్కార్ మొండి వైఖరి వీడి.. అభ్యర్థులను చర్చలకు ఆహ్వానించాలని కేటీఆర్ కోరారు. బండి సంజయ్‌ను ఆహ్వానించారని జర్నలిస్టులు తెలియజేయగా.. కేటీఆర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ పరీక్ష రాయట్లేదని.. ఆయన పెద్దగా చదువుకోలేదని.. ఆయనకు చెప్పినా అర్థం కాదంటూ సైటైరికల్‌గా స్పందించారు. అంతేకాకుండా.. బండి సంజయ్‌కు పరీక్షా పేపర్లు లీకులు చేయటమే తెలుసంటు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు బదులు అభ్యర్థులు పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు.


కేటీఆర్ చేసిన కామెంట్లపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తాను పేపర్ లీక్ చేసినట్లు కుటుంబతో సహా కేటీఆర్ ప్రమాణం చేస్తారా అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు కేటీఆర్‌దని కీలక వ్యాఖ్యలు చేశారు. తన జోలికి వస్తే చీకటి బతుకు మొత్తం బయటపెడ్తానని కేటీఆర్‎ను హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేయగలరా అని కేటీఆర్‌ను నిలదీశారు. అంతేకాకుండా తూ.. నీ బ.. చె.. అంటూ తీవ్ర పదజాలాన్ని బండి సంజయ్ వాడారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM