సీఎం చేతికి 317 జీఓ అమలుపై నివేదిక

byసూర్య | Mon, Oct 21, 2024, 07:18 PM

317 జీవో పై సబ్‌ కమిటీలో చర్చించి ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిష్ణాతులైన మేధావులతో అభిప్రాయాలను, సూచనలను సేకరించి పూర్తి నివేదికను ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డికి హైద్రాబాద్‌లోని స్వగృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి అందజేశారు. 317 జీఓ అమలుపై  రాష్ట్ర ప్రభుత్వం  క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ  అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌లు పలు సంఘాల నాయకులు, మేధావులతో సమావేశమైన విషయం తెలిసిందే.ఉద్యోగుల, ఉపాధ్యాయుల  అభిప్రాయాలను క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్‌ ద్వారా అప్లికేషన్స్‌ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో  పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్‌ కవర్‌ లో ఉంచి ముఖ్యమంత్రికి అందజేశారు. త్వరితగతిన 317 జీఓ అమలుకు సంబంధించిన విషయాలపై నివేదికను అందజేసినందుకు మంత్రులను సీఎం అభినందించారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM