హైదరాబాద్‌ నగరంలోకి కొత్త దొంగల బ్యాచ్

byసూర్య | Sun, Oct 20, 2024, 10:13 PM

హైదరాబాద్ వాసులారా బీ అలర్ట్.. డేంజర్ దొంగల బ్యాచ్ మళ్లీ నగరంలో దిగింది. రెండేళ్ల క్రితం.. హైదరాబాద్‌లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ సంచలనం రేపగా.. ఇప్పుడు మరోసారి అదే స్టైల్‌లో దొంగతనాలు చేసే గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. తాజాగా.. మల్కాజిగిరిలో ఈ గ్యాంగ్ తన హస్తవాసిని ప్రయోగించింది. సాధారణ ప్రజల్లో కలిసిపోయి.. వారి దృష్టి మరల్చి.. అదే క్షణంలో నిలువుగా దోచేసి.. అక్కడి నుంచి పరారవటమే వీళ్ల స్టైల్. అచ్చంగా అలాగే పలు చోరీ కూడా చేశారు. ఆదివారం (అక్టోబర్ 20న) రోజున పొద్దుపొద్దునే.. ఆనంద్ బాగ్లో ఇద్దరు వ్యక్తుల నుంచి చూస్తుండగానే మొబైల్ ఫోన్లు కొట్టేయటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ చోరీలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


ఉదయం పూట.. ఆనంద్ బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తిని టార్గెట్ చేసిన అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్.. అందరూ చూస్తుండగానే బాధితుని జేబులో నుంచి ఫోన్ కొట్టేసి.. క్షణాల్లోనే జంప్ అయిపోయారు. ఈస్ట్ ఆనంద్ బాగ్లోని మార్కెట్కు వెళ్లిన మరో బాధితుని దగ్గరి నుంచి కూడా మొబైల్ ఫోన్ కొటేశారు. ఇద్దరు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వాళ్లిద్దరు చెప్పిన వివరాల ప్రకారం ఆ రెండు గ్యాంగులు ఒకటేనని పోలీసులు అనుమానించి.. సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం అర్థమైంది.


అయితే.. ఈ గ్యాంగ్ పక్కా ప్లాన్ ప్రకారం మొబైల్స్ కొట్టేస్తున్నారు. సాధారణంగా.. కొంచె రద్దీగా ఉన్న ప్రదేశానికి ఈ గ్యాంగ్ వెళ్తుంది. అక్కడే ఓ వ్యక్తిని ఎంచుకుంటుంది. సాధారణ ప్రజల్లాగే ఆ రద్దీలో ఇద్దరు కలిసిపోతారు. వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి దగ్గరకి వెళ్తారు. ఒకడేమో జేబులో నుంచి డబ్బులు తీసి ఓ నోటు కింద పడేసి.. "మీ డబ్బులు కింద పడ్డాయి" అని చెప్పి ఆ వ్యక్తి దృష్టిని మరల్చుతాడు. కిందికి వంగి డబ్బులు తీసుకునే సమయంలో.. మరొకడు బాధితుని జేబులో నుంచి ఫోన్ అయితే ఫోన్, పర్స్ అయితే పర్స్‌ను దర్జాగా తీసుకుని మెల్లగా జారుకుంటాడు. తన మొబైలో, పర్సో పోయిందని తెలుసుకునేలోపు.. వీళ్లిద్దరూ దూరంగా రెడీగా ఉన్న బైక్ ఎక్కి జంప్ అవుతారు.


ఈ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌ వరుస చోరీల నేపథ్యంలో.. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే.. రెండేళ్ల క్రితం కూడా అచ్చంగా ఇలాగే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ సంచలనం సృష్టించింది. 2022లో తక్కువ ధరకు గోల్డ్ అమ్మకాల పేరుతో అరకోటికిపైగా కొట్టేసిన అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.


Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM