న్యాయం చేయాలని మందు డబ్బులతో రోడ్డెక్కిన రైతులు..

byసూర్య | Sun, Oct 20, 2024, 07:46 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బిబిరాజుపల్లి నుండి రాఘవపట్నం వరకు ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ కాలువ పక్కన దారి లేదని బిబిరాజుపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శనివారం తహసిల్దార్ కార్యాలయం ముందుట దీక్ష కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బిబిరాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ.. పంట పొలాలకు వెళ్ళడానికి అందరూ కలసి కెనాల్ కాలువ పక్క నుండి దారి ఉండాలని పరిహారం నిమిత్తం గత 20సంవత్సరాల కిందట భూములను ఇచ్చారని,రైతులకు ఇప్పటికీ ఎలాంటి పరిహారం రాకపోవడంతో రైతులలో ఒక రైతు నునుగొప్పుల నరేష్ అధికార పార్టీ నాయకుడి అండదండలు చూసుకొని ప్రస్తుతం వెళ్తున్న దారికే నేను భూమి ఇవ్వలేనని నిన్న వారి కుటుంబ సభ్యులతో కలిసి మందు డబ్బాతో తహసిల్దార్  ను కలిసిన సంఘటన విధితమే.
నరేష్  నా భూమిలో నుండి ఎవరికీ దారి లేదని,ఎవరు కూడా నడవడానికి వీలు లేదని పక్కన రైతులను నడవనివ్వక మిగతా రైతులు పంట చేతికి వచ్చే సమయంలో ఇప్పుడు దారి లేదని దారిని మూసివేస్తున్న రైతును వెంటనే అధికారులు  ప్రజాప్రతినిధులు స్పందించి దారి సమస్య పరిష్కరించాలని రైతులు నినాదాలతో కార్యాలయ ఆవరణం ఉద్రిక్తత దారి తీయడంతో విషయం తెలుసుకున్న ఎస్సై  చిర్ర సతీష్  సంఘటన స్థలానికి చేరుకొని దీక్షను విరమింప చేశారు.అనంతరం గ్రామ ప్రజలు తహసిల్దార్ వరందన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం ప్రవీణ్,నునుగోపుల చిన్న నర్సయ్య,కాసావేణి కొమురయ్య,తోట్ల చంద్రశేఖర్,అల్లం రాజయ్య,గుజిలం మహేష్,తిప్పనవీని రాజకుమార్,మహేష్,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM