యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు

byసూర్య | Sat, Oct 19, 2024, 07:44 PM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పబ్బుల్లో గబ్బు పనులు చేస్తూ.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టాస్ పబ్‌ నిర్వహిస్తున్న పోలీసుల దాడుల్లో తేలింది. హైదరాబాద్ నగరంలో కొత్త కల్చర్‌కు తెరతీస్తూ.. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎర వేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో పబ్‌లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారు. పబ్‌కు వచ్చే యువత ముందు అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ డబ్బులు వెనుకేసుకుంటున్నారు.


  పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో మెుత్తం 140 మంది యువతీ యువకులు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు వచ్చిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. పబ్‌లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం ఆ దిశగా.. పోలీసులు విచారణ చేపట్టారు. పబ్‌కు వెళ్లిన దాదాపు 100 మందికి నోటీసులు జారీ చేశారు.


ఇక నగరంలోని పబ్‌లపై టాస్క్‌పోర్స్, నార్కోటిక్, ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీకెండ్‌లో జరుగుతున్న పార్టీలపై నిఘా ఉంచుతున్నారు. ఇటీవల 75 వరకు పబ్‌లపై దాడులు నిర్వహించగా పలువురికి పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టు్లలో తేలింది. మరికొన్ని పబ్స్‌లో మైనర్లు నకిలీ ఆధార్లతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఇంకొన్ని చోట్ల దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి.


అమ్మాయిలతో బడా వ్యాపారులకు పబ్ యాజమాన్యం వల విసురుతున్నట్లు తేలింది. వ్యాపారులు, డబ్బున్నవారిని టార్గెట్ చేసి అమ్మాయిలతో ట్రాప్ చేయిస్తున్నారు. అనంతరం పబ్‌లకు రప్పించి పీకలదాకా మద్యం తాగించి అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారం క్రితం ఇటువంటి కేసులో పబ్ నిర్వహకులు, అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా పబ్‌లో ఇటువంటి దోపిడీ జరగుతుండగా... పక్కా నిఘా మేరకు దాడులు నిర్వహించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM